మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

త్వరలో రూ.10 ప్లాస్టిక్ నోట్లు.. రూ.2వేల నోటు రద్దుపై కేంద్రం క్లారిటీ

Updated: 16-03-2018 08:25:26

న్యూఢిల్లీ: నోట్ల రద్దు తర్వాత కేంద్రం ప్రవేశపెట్టిన రూ.2 వేల నోటును రద్దు చేస్తారని జరుగుతున్న ప్రచారంపై కేంద్రం స్పందించింది. ఆ నోటును రద్దు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆర్థికశాఖ సహాయమంత్రి రాధాకృష్ణన్ లోక్‌సభకు తెలిపారు. అలాగే త్వరలోనే రూ.10 ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. రూ.10 నోట్లను కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్‌లలో ట్రయల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.500, రూ.2000 నోట్ల పరిమాణంలో 10 మిల్లీమీటర్ల తేడా ఉందని, కాబట్టి రెండు నోట్లను తేలిగ్గానే గుర్తించవచ్చని వివరించారు.  

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.