మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

వల్లభనేని వంశీ షాకింగ్ నిర్ణయం

Updated: 19-09-2017 02:02:57

విజయవాడ: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తన భద్రత కోసం ప్రభుత్వం కేటాయించిన ఇద్దరు గన్‌మెన్‌లను సరెండర్ చేశారు. తనకు టూ ప్లస్ టూ గన్‌మెన్ల భద్రత కల్పించాలని మూడున్నరేళ్లుగా చెబుతున్నా కల్పించనందుకు నిరసనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.  తన గన్‌మ్యాన్‌కు ఒక్క పిస్టలే ఇచ్చారని, కనీసం కార్బైన్ వెపన్ కూడా ఇవ్వలేదన్నారు. తన లైసన్స్‌డ్ ఆయుధాలను మూడింటిని పోలీస్ స్టేషన్‌లో అప్పగించానన్నారు. ఆ మూడు వెపన్స్‌ను తిరిగి తీసుకోలేదని చెప్పారు. మాజీ సీపీ సీతారామాంజనేయులు నుంచి తనకు ప్రాణహాని ఉందని మాజీ సీపీ వెంకటేశ్వరరావుకు చెప్పినా ఆయన పట్టించుకోలేదని వంశీ వాపోయారు. టిడిపి ప్రభుత్వం వచ్చినా తన సమస్య పరిష్కారం కాకపోవడం తనను ఆవేదనకు గురిచేసిందన్నారు. తన సంగతి సిఎం చంద్రబాబుకు ఏరోజూ చెప్పలేదన్నారు. అయితే తన భద్రత గురించి ఇంటెలిజెన్స్ విభాగం నిర్లక్ష్యాన్ని ఆయన సహించలేకపోతున్నారు. 

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.