మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

శ్రీదేవి పార్థివ దేహాన్ని చూసి బరస్ట్ అయిన విద్యాబాలన్

Updated: 28-02-2018 02:37:58

ముంబై: శ్రీదేవికి కడసారి నివాళులర్పించేందుకు వచ్చిన బాలీవుడ్ నటి విద్యాబాలన్ బరస్ట్ అయ్యారు. శ్రీదేవిని అలా చూసేసరికి తట్టుకోలేక కన్నీరుమున్నీరయ్యారు. తీవ్ర ఉద్వేగానికి లోనవుతూ ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె లేరన్న ఊహే కష్టంగా ఉందని వాపోయారు. ఆమెను ఓదార్చడం అక్కడున్న ఎవరి వల్లా కాలేదు. శ్రీదేవి సంపూర్ణ నటి అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న విద్యాబాలన్, ఆమే తనకు స్ఫూర్తి అని పలుమార్లు చెప్పారు. శ్రీదేవి మరణవార్త తెలిసిన రోజున ఆమె స్పందిస్తూ తనకు స్ఫూర్తినిచ్చిన ఆమె ఇక లేరని ట్వీట్ చేశారు. కాగా, అభిమానుల అశ్రునయనాల మధ్య శ్రీదేవి అంతమయాత్ర ప్రారంభమైంది. 

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.