మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       జాతీయం న్యూస్

ఒక్కసారిగా 15 సెలవులు కట్ చేసిన యోగి...

Updated: 25-04-2017 08:12:37

లక్నో: యూపీ కొత్త సిఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తన నిర్ణయాలతో టాక్ ఆఫ్ ద నేషన్‌గా నిలుస్తోన్న యోగి ఆదిత్యనాథ్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు లభిస్తున్న 15 సెలవులను కట్ చేశారు. సెలవుల జాబితానుంచి 15 రోజులను తొలగించారు. యోగి తాజా నిర్ణయంతో ఉద్యోగులు లబోదిబో అంటున్నారు. మహనీయుల జయంతి, వర్ధంతులకు సెలవులను కట్ చేయడంతో ఉపాధ్యాయులంతా గుర్రుగా ఉన్నారు. ఇకపై మహనీయుల జయంతి, వర్ధంతి ఉన్న రోజున ఆదివారం వస్తే ఆ రోజు కూడా విద్యా సంస్థలు పనిచేస్తాయి. గంట సేపు ఆ మహనీయులకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మహనీయుల జీవితాల్లో స్పూర్తిదాయక ఘట్టాలను తెలిపే కార్యక్రమాలు విద్యార్ధుల కోసం  చేపట్టాలని ఆదేశించారు. 

షేర్ :

మరిన్ని జాతీయం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.