ఏపీ, తెలంగాణలను చుట్టేయనున్న ఎయిర్‌టెల్

టెలికం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను చుట్టేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. 2018-19 సంవత్సరంలో రెండు రాష్ట్రాల్లోనూ కలిపి 15 వేల కొత్త సైట్లతోపాటు 3వేల కిలోమీటర్ల పరిధిలో ఆప్టిక్ ఫైబర్ కేబుళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు బుధవారం తెలిపింది.

గ్రామీణ ప్రాంతాలతోపాటు, పట్టణాలతో అనుసంధానం లేని గ్రామాల్లోకి కూడా ఈ ప్రాజెక్టు ద్వారా చొచ్చుకెళ్లనుంది. 2017-18 సంవత్సరంలో ఎయిర్‌టెల్ 1000 కొత్త సైట్లు ప్రారంభించింది. రెండు రాష్ట్రాల్లోని 354 పట్టణాల్లోని 85 శాతం ప్రజలకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది.

దేశంలోని అగ్రగామి సంస్థగా తమ ఖాతాదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించాలని కంకణం కట్టుకున్నట్టు ఎయిర్‌టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అవ్‌నీత్ సింగ్ పురి తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*