ఘనంగా శ్రియా భూపాల్ పెళ్లి

హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామిక వేత్త జీవీ కృష్ణారెడ్డి మనవరాలు శ్రియా భూపాల్ అపోలో హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి మనవడు అనిందిత్ రెడ్డి వివాహం హైటెక్స్‌లో కన్నుల పండువగా జరిగింది. తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ తెలుగుతనం ఉట్టిపడేలా వివాహం జరిగింది. గవర్నర్ నరసింహన్ దంపతులతో పాటు సీఎం కేసీఆర్, మెగాస్టార్ చిరంజీవి, కాంగ్రెస్ ఎంపీ టి. సుబ్బరామిరెడ్డి తదితరులు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనిందిత్ రెడ్డి, శ్రియా భూపాల్ స్కూల్‌లో చదువుకునే రోజుల్లోనే మంచి స్నేహితులు. చాలా కాలంగా ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. అనిందిత్ రెడ్డి అమెరికా మిచిగాన్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ చేయగా, శ్రియా భూపాల్ న్యూయార్క్, లండన్‌లో చదువుకున్నారు. అనిందిత్ రెడ్డి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరక్టర్ సంగీతా రెడ్డి తనయుడు. శ్రియా భూపాల్ సోమనాద్రి భూపాల్, షాలినీ కుమార్తె.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*