క‌లైంజ‌ర్‌ను ప‌రామ‌ర్శించిన ర‌జినీకాంత్‌

చెన్నై: అనారోగ్యంతో కావేరి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత‌ కరుణానిధిని సూప‌ర్ స్టార్ ర‌జినీ కాంత్ ప‌రామ‌ర్శించారు. క‌రుణ ఆరోగ్య ప‌రిస్థితి ఎలా ఉంద‌ని డాక్ట‌ర్ల‌ను అడిగి తెలుసుకున్నారు. ర‌జినీ ఆసుప‌త్రిని సంద‌ర్శించిన‌ స‌మ‌యంలో స్టాలిన్‌తో పాటు ఇత‌ర కుటుంబ స‌భ్యులున్నారు. క‌రుణ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ర‌జినీ ఆకాంక్షించారు.

మ‌రోవైపు క‌రుణ ఆరోగ్యంపై కావేరీ ఆసుప‌త్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుద‌ల చేశారు. క‌రుణ ఆరోగ్యం మెరుగౌతోంద‌ని తెలిపారు.

అంత‌కుముందు కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప‌రామ‌ర్శించారు. రాహుల్ వ‌చ్చిన విష‌యాన్ని కుమారుడు స్టాలిన్ క‌రుణ చెవిలో చెప్పారు. ఆ స‌మ‌యంలో క‌రుణ క‌ష్టంగా స్పందించారు. ఈ సంద‌ర్భంలో తీసిన ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. పెద్దాయ‌న ఇంత‌లా చిక్కిపోయారా అని అభిమానులు కంట‌త‌డి పెట్టుకుంటున్నారు. రాహుల్ ఆసుప‌త్రిని సంద‌ర్శించిన స‌మ‌యంలో మార‌న్ కూడా అక్క‌డే ఉన్నారు.

క‌రుణ‌ను ఇప్ప‌టికే తమిళనాడు సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు.

కావేరీ ఆసుపత్రి ఐసీయూలో ఎనిమిది మంది నిపుణుల బృందం కరుణను పర్యవేక్షిస్తోంది. 94 ఏళ్ల కరుణానిధి కొద్ది రోజులుగా జ్వరం, లో బీపీ, మూత్ర సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నారు. అటు ఆసుపత్రి బయట డీఎంకే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. కరుణ ఆరోగ్యం గురించి వాళ్లు ఆందోళన చెందుతున్నారు.

కార్యకర్తలు సంయమనం పాటించాలని స్టాలిన్ సూచించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*