కేసీఆర్‌తో పాటు ఒక్కరు మాత్రమే ప్రమాణం

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. గురువారం మధ్యాహ్నం ఒకటిన్నరకు రాజ్‌భవన్‌లో కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేసీఆర్‌తో పాటు మరొకరు మాత్రమే ప్రమాణం చేస్తారు. అయితే ఆ ఒక్కరు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

గత కేబినెట్‌లో మహిళలకు చోటు దక్కలేదు. ఈ సారి టీఆర్ఎస్ నుంచి మహిళా ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో గెలవడంతో వారిలో కొందరికి కేబినెట్‌లో ఛాన్స్ ఉంటుందని సమాచారం.

119 స్థానాలకు గానూ టీఆర్ఎస్ మొత్తం 88 సీట్లు సాధించగా మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్‌లో చేరేందుకు సముఖత వ్యక్తం చేశారు. దీంతో టీఆర్ఎస్ బలం 89కి చేరనుంది.

అటు హైదరాబాద్‌లో టీఆర్ఎస్ఎల్‌పి సమావేశం జరిగింది. కేసీఆర్‌ను టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. తీర్మాన ప్రతిని గవర్నర్‌ నరసింహన్‌కు అందజేయనున్నారు.

https://twitter.com/trspartyonline/status/1072486034406105088

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*