కంగారూలను చిత్తు చేసిన భారత్… బుమ్రా, మయాంక్‌లపై కోహ్లీ, సచిన్ ప్రశంసలు

మెల్‌బోర్న్: బాక్సింగ్ డే టెస్టులో ఆతిధ్య ఆస్ట్రేలియాను భారత్ చిత్తు చేసింది. 137 పరుగుల తేడాతో ఓడించింది. 4 టెస్టుల సిరీస్‌లో 2-1తో ముందుంది. 8 వికెట్ల నష్టానికి 258 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో మూడు పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయింది. బుమ్రా, జడేజా చెరి మూడు వికెట్లు తీశారు. ఇషాంత్ చెరి రెండు వికెట్లు తీశారు.

భారత్ తొలి ఇన్నింగ్స్‌: 7 వికెట్ల నష్టానికి 443 పరుగులకు డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 151 ఆలౌట్,

భారత్ రెండో ఇన్నింగ్స్: 8 వికెట్ల నష్టానికి 106 పరుగులకు డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 261 ఆలౌట్.

తాజా విషయంతో భారత్ టెస్టుల్లో 150వ విజయాన్ని సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన బుమ్రా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

మ్యాచ్ గెలిచాక కోహ్లీ మాట్లాడుతూ బుమ్రా, మయాంక్ అగర్వాల్‌పై ప్రశంసలు కురిపించారు. ఇద్దరూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారని చెప్పారు.

టెండుల్కర్ కూడా బుమ్రాపై ప్రశంసలు కురిపించారు.

సిడ్నీ టెస్టులో గెలిచి 3-1తో భారత్ టెస్ట్ సిరీస్ నెగ్గడం ఖాయమని హర్భజన్ జోస్యం చెప్పాడు.

ఐదో రోజు భారత బౌలర్లలో బూమ్రా, జడేజా తలో మూడు, ఇషాంత్, షమీ తలో రెండు వికెట్లు పడగొట్టారు. రెండు జట్ల మధ్య నాలుగో టెస్ట్ జనవరి మూడున సిడ్నీలో ప్రారంభమౌతుంది.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*