అంతరిక్షంలో నేడు మరో వింత.. సూర్యుడికి అతి దగ్గరగా భూమి

అంతరిక్షంలో నేడు మరో వింత ఆవిష్కృతం కానుంది. భూమి నేడు సూర్యడికి మరింత దగ్గర కానుంది. ఖగోళ పరిభాషలో దీనిని పెరిహిలియన్ అని అంటారు. అలాగే సూర్యుడిని దూరంగా వెళ్లడాన్ని అపిలియన్ అని పిలుస్తుంటారు. నేడు ఆవిష్కృతం కానున్న ఈ వింతను పెరిహిలియన్ అని అంటారు. భూమి-సూర్యడు పరస్పరం దగ్గరకు రావడం ఏడాదిలో రెండుమూడుసార్లు జరుగుతుంటుంది. నిజానికి ఈ మార్పు ప్రజలకు కనిపించకున్నా ఖగోళపరంగా చాలా ముఖ్యమైనదని శాస్త్రవేత్తలు తెలిపారు.

అది అపోహ మాత్రమే
భూమికి, సూర్యుడికి మధ్య దూరం తగ్గడం వల్ల వాతావరణంలో మార్పులు సంభవిస్తాయన్నది కేవలం అపోహ మాత్రమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జనవరిలో సూర్యడికి అత్యంత సమీపంలోకి వెళ్లే భూమి జూలైలో దూరంగా జరుగుతుంది. ఇలా జరగడం వల్లే రుతువులు ఏర్పడతాయన్న వాదనలో నిజం లేదని పేర్కొన్నారు. ఖగోళ మార్పుల వల్ల ఈ నెల 12వ తేదీ వరకు సూర్యోదయానికి ముందు ఆకాశంలో ఉల్కలు రాలిపడతాయని, అందరూ చూడొచ్చని తెలిపారు. శుక్రవారం ఉల్కలు మరింతగా రాలిపడతాయని ఖగోళ నిపులు వివరించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*