కుంభమేళలో నృత్యప్రదర్శనకు శుభాన్వితకు ఆహ్వానం

హైదరాబాద్: ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలతో పలు అవార్డును అందుకున్న కుమారి శుభాన్విత అలహాబాద్ (ప్రయాగరాజ్)లో జరుగుతున్న కుంభమేళలో నృత్య ప్రదర్శనకు ఎంపికైంది. సి.సి.ఆర్.టి. స్కాలర్ షిప్ అందుకుంటున్న శుభాన్విత తెలంగాణ ప్రభుత్వం నుండీ బాలరత్న అవార్డునూ పొందింది.

‘దేశవ్యాప్తంగా 50 మంది నృత్యకళాకారులను ఎంపిక చేయగా, తెలంగాణా నుండి భరతనాట్యం కేటగిరిలో కేవలం శుభాన్వితకే ఈ అవకాశం దక్కింద’ని, ఆమె గురువు, ఉత్తర సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (యు.సి.పి.ఎ.) వ్యవస్థాపకురాలు శ్రీమతి గీతా గణేశన్ హర్షం వెలిబుచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*