యోగా టీచర్‌ కావాలనుకునే వారికి రామకృష్ణ మఠం సువర్ణావకాశం

హైదరాబాద్: యోగా టీచర్ కావాలనుకునే వారికి హైదరాబాద్ రామకృష్ణామఠం సువర్ణావకాశాన్నిస్తోంది. వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ద్వారా ఈ నెల 19నుంచి యోగా అధ్యయన్ శిబిర్ ప్రారంభం కానుంది. ప్రతి శని, ఆదివారాలలో సాయంత్రం 5:20 నుంచి 7:30 వరకూ థియరీ, ఫ్రాక్టికల్ తరగతులు నిర్వహిస్తారు. నాలుగు నెలల పాటు నిర్వహించే ఈ సర్టిఫికెట్ కోర్సులో యోగాసనాలు, సూర్యనమస్కారాలు, ప్రాణాయామం, ధ్యానంతో పాటు ముద్రల గురించి కూడా అవగాహన కల్పిస్తారు. రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్పిస్తారు. స్వామి వివేకానంద ప్రభోదించిన కర్మయోగ, భక్తియోగ, జ్ఞాన యోగ, రాజయోగాలతో పాటు భగవద్గీతపై కూడా తరగతులు నిర్వహిస్తారు.

శారీరక, మానసిక ఫిట్‌నెస్‌తో పాటు ఆధ్యాత్మిక వికాసానికి కోర్సు తోడ్పడుతుంది. రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది. భావోద్వేగాలను అదుపుచేసుకోగలుగుతారు. అంతర్లీనంగా శాంతియుతంగా ఉంటూ ఒత్తిడిని అధిగమించగలుగుతారు.

18 నుంచి 50 ఏళ్ల లోపు వయసున్న స్త్రీ, పురుషులు, ప్రొఫెషనల్స్‌, యువ ఔత్సాహికులందరూ అర్హులే.

మరెందుకు ఆలస్యం… మిమ్మల్ని మీరు మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు తక్షణమే రామకృష్ణా మఠానికి కదలండి. స్వామి వివేకానందుడి స్ఫూర్తిని మీ జీవితాల్లో నింపుకోండి.

https://rkmath.org/humanexcellence

https://www.facebook.com/Ramakrishnamathhyd/

రామకృష్ణ మఠం కార్యాలయం పని వేళలు

ఉదయం 8:30 నుంచి 11:30 వరకూ
సాయంత్రం 4:30 నుంచి 7:30 వరకూ

రామకృష్ణ మఠం ఫోన్ నెంబర్లు
040-27627961
9177232696

 

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*