తన పాత్రలో స్వయంగా నటిస్తున్న వైఎస్ జగన్?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘యాత్ర’ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్‌గా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

వైఎస్ తండ్రి రాజారెడ్డి పాత్రలో ప్రముఖ నటుడు జగపతిబాబు నటిస్తున్నారు.

మహి.వి.రాఘవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన పాత్రలో స్వయంగా కనిపించనున్నారట. జగన్ నిజ జీవిత పాత్రలో స్వయంగా నటించినట్టు చిత్ర యూనిట్ తెలిపింది.

2004 ఎన్నికలకు ముందు వైఎస్సార్ చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘యాత్ర’ సినిమాలో కాంగ్రెస్ నేత గౌరు చరితా రెడ్డి పాత్రలో నటి అనసూయ నటిస్తున్నట్టు టాలీవుడ్ కథనం. 2004 ఎన్నికల్లో ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆమె గెలిచిన విధానం.. అప్పటి పరిస్థితులను ఆమె ఎదుర్కొన్న తీరు, కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె చేసిన కృషి వంటివి చూపించనున్నారు.

ఫిబ్రవరి 8న ‘యాత్ర’ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సినిమాపై వైఎస్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*