ఏపీ కేబినెట్‌ నిర్ణయాలివే:

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్రమంత్రుల పర్యటనలపై కేబినెట్‌లో చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఎంత ఇచ్చింది, ఇంకా ఎంత ఇవ్వాలి అనేది చెప్పామని సీఎం చంద్రబాబు మంత్రులతో అన్నట్లు తెలిసింది. వారానికో కేంద్రమంత్రి రాష్ట్రానికి వచ్చి కేంద్రం ఏం చేసిందో చెబుతారనే విషయంపై మాట్లాడుతూ

కేంద్ర మంత్రుల పర్యటనలకు లేఖల ద్వారా జవాబివ్వాలని చెప్పారు.

ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు:

 

2014 నుంచి అనుమతి లేకుండా నిర్మించిన 1.66 లక్షల పేదల ఇళ్లకు…

రూ. 756 కోట్లు చెల్లించాలని కేబినెట్‌ నిర్ణయం

ఒక్కో ఇంటికి రూ. 60వేలు మంజూరు చేయాలని కేబినెట్‌ నిర్ణయం

ఇంటికి రూ. 45వేలు, మరుగుదొడ్డికి రూ. 15వేలు ఇవ్వాలని నిర్ణయం

1996-2004 మధ్య ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల మరమ్మతులకు…

రూ. 10వేల చొప్పున ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం

ట్రాక్టర్లు, ఆటోలకు జీవితకాలం పన్ను మినహాయింపు

డ్వాక్రా మహిళలకు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వాలని నిర్ణయం

ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ చెల్లించాలని నిర్ణయం

ఐటీ ప్రోత్సాహకాలు పొడిగించేందుకు కేబినెట్‌ ఆమోదం

చేనేత కార్మికులకు ఆరోగ్యబీమా వర్తింపు

ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్-1977 చట్టాన్ని సవరించే…

డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ రూపకల్పనకు కేబినెట్‌ ఆమోదం

ప్రకాశం జిల్లా పామూరు, చందలూరులో…

ఎంఎస్‌ఎంఈ పార్క్‌ల కోసం 102 ఎకరాల భూమి కేటాయింపు

రాజధానిలో జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణానికి…

30 ఎకరాలు కేటాయించాలని కేబినెట్‌ నిర్ణయం

ఎకరా రూ. 25 లక్షలకు ఇవ్వాలని నిర్ణయం

ప్రభుత్వ, జ్యుడిషియరీ ఉద్యోగులకు …

ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*