ఆ ముగ్గురికి భారతరత్న పురస్కారాలు ప్రకటించిన మోదీ సర్కారు

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, దివంగత ఆర్ఎస్ఎస్ నేత నానాజీ దేశ్‌ముఖ్, అస్సామీ జానపద గాయకుడు భూపెన్ హజారికాలకు భారత రత్న ప్రకటించారు. నానాజీ దేశ్‌ముఖ్, భూపెన్ హజారికాలకు మరణానంతరం ఈ పురస్కారాన్ని ప్రకటిస్తూ కొద్దిసేపటి క్రితం ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాజకీయాలకు అతీతంగా ప్రణబ్‌కు భారతరత్న ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. 1935 డిసెంబర్‌ 11న జన్మించిన ప్రణబ్‌ ముఖర్జీ అంచలంచెలుగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా మారి నెహ్రూ, ఇందిర, రాజీవ్, సోనియాకు విశ్వసనీయుడిగా మారారు. 2004 నుంచి 2006 వరకు రక్షణమంత్రిగా, 2009 నుంచి 2012 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2012 నుండి 2017 వరకు 13వ రాష్ట్రపతిగా పనిచేశారు.భూపేన్‌ హజారికా ప్రముఖ సంగీత విద్వాంసుడు కాగా నానాజీ దేశ్‌ముఖ్‌ సంఘ సేవకుడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*