అమృత ఇంట.. ఆనందాల పంట

ప్రేమించి పెళ్లి చేసుకుని దారుణ హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత సరిగ్గా పెళ్లి రోజునాడే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. గత ఏడాది మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ప్రణయ్‌ను తన కుమార్తె అమృత ప్రేమించి పెళ్లాడిన ప్రణయ్‌‌పై కక్ష పెంచుకున్న ఆమె తండ్రి మారుతీరావు కిరాయి హంతకులతో ప్రణయ్‌ను దారుణంగా చంపించాడు.

అప్పటికి అమృత ఐదు నెలల గర్భిణి. బుధవారం అమృత మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. చనిపోయిన ప్రణయ్ మళ్లీ పుట్టాడంటూ అమృత సహా ఇంటిల్లిపాదీ సంబరాల్లో మునిగిపోయారు. సరిగా ప్రణయ్, అమృతల పెళ్లి రోజు కావడం విశేషం.

కులం తక్కువ వాడిని ప్రేమించి పెళ్లాడిందన్న కోపంతోనే ప్రణయ్‌ను చంపించినట్టు అమృత తండ్రి మారుతీరావు స్వయంగా ఒప్పుకున్నాడు. గర్భిణి అయిన అమృత ఆసుపత్రిలో చూపించుకున్న వస్తున్న సమయంలో ఆసుపత్రి బయటే కాపు కాసిన దుండగుడు ప్రణయ్‌ను అత్యంత దారుణంగా అందరూ చూస్తుండగానే నరికి చంపాడు.

రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన మారుతీరావు ఐదేళ్లలోనే వందల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడు. ఈ క్రమంలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఆ డబ్బు ఇచ్చిన ‌కిక్కుతో మానవత్వాన్ని మరచిపోయి హత్య చేయించాడని అప్పట్లో తీవ్రమైన ఆందోళనలు జరిగాయి.

ప్రణయ్ హత్య జరిగినప్పటి నుంచి అమృత, ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు. ప్రణయ్‌ను హత్య చేయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమృతరావు ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*