అమృతకు పండంటి మగబిడ్డ

హైదరాబాద్: మిర్యాలగూడకు చెందిన ప్రణయ్, అమృత జంటకు పండంటి మగబిడ్డ పుట్టాడు. ప్రణయ్ చనిపోయిన నాలుగు నెలలకు అమృత శిశువుకు జన్మనిచ్చింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ‌లో సాయంత్రం 4.15గంటలకు ప్రసవించింది. తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారు. ప్రణయ్ మళ్లీ పుట్టాడని అమృత ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.
గతేడాది సెప్టెంబర్ 14న మిర్యాలగూడ హాస్పిటల్ ముందు ప్రణయ్ దారుణ హత్యకు గురయ్యాడు. తనకు నచ్చని వ్యక్తిని పెళ్లిచేసుకుందనే కోపంతో అమృత తండ్రి మారుతీరావు … ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ మర్డర్ కు కోటి రూపాయలు డీల్ కుదిరింది. నేరం జరిగిన స్వల్ప కాలంలోనే నిందితులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*