హైదరాబాద్ పాతబస్తీలో గ్యాంగ్ వార్.. దారుణ హత్య

హైదరాబాద్: ఓ ఫ్లెక్సీ విషయంలో జరిగిన గొడవలో ఎక్కడో ఉంటూ పెద్దమ్మ కుమారుడికి మద్దతు ఇస్తున్న ఓ యువకుడిపై ప్రత్యర్థి గ్యాంగ్ కక్ష కట్టింది. అవకాశం కోసం గ్యాంగ్ సభ్యులు ఎదురు చూశారు. ఛాన్స్ దొరకగానే విరుచుకు పడ్డారు. హాకీ బ్యాట్‌లు, కత్తులతో హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా నగర్‌లో అర్ధరాత్రి వీరంగం సృష్టించారు. స్నేహితుడి జన్మదిన వేడుకలు ముగించుకొని బైక్‌పై తన తమ్ముడుని ఇంటి వద్ద వదలడానికి వస్తున్న వారి కదలికలు గమనించి దాడి చేశారు. రాకేష్ అనే 23 ఏళ్ల యువకుడిపై పలు మార్లు బండరాయితో తలపై విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనలో అడ్డు వచ్చిన వారిపై కూడా దాడి చేసింది.

ల్యాబ్స్ క్వార్టర్స్‌కు చెందిన రాకేష్ కుమార్ జీహెచ్‌ఎంసీలో కార్ డ్రైవర్‌గా పని చేసేవాడు. పాతబస్తీ సాయిబాబా‌నగర్‌లో ఉండే తన పెద్దమ్మ కుమారుడికి స్థానిక లంబాడీ రాజు గ్యాంగ్‌తో ఓ బ్యానర్ విషయంలో చాలాసార్లు గొడవ జరిగింది. పెద్దమ్మ కుమారుడికి రాకెష్ అండగా నిలవడడంతో లంబాడీ రాజు గ్యాంగ్ రగిలిపోయింది.

ఎక్కడో ఉంటూ తమ దగ్గర పెత్తనం ఏంటని రాకేష్‌పై కక్ష పెంచుకున్న లంబాడీ రాజు గ్యాంగ్ అదను చూసి మాటు వేసి దాడికి పాల్పడింది. బైక్‌లను ధ్వంసం చేసి రాకేష్‌ను హాకీ బ్యాట్లతో కొట్టి కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడ్డ రాకేష్‌పై రాళ్ళతో తలపై మోదీ హత్య చేశారు.

ఛత్రినాక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. దర్యాప్తు కొనసాగుతోందని ఫలకనుమా ఏసీపీ అబ్దుల్ రషీద్ తెలిపారు. దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*