మహాత్మునికి ప్రముఖుల నివాళి

జాతిపిత మహాత్మాగాంధీ 71వ వర్థంతి నేడు.ఈ సందర్భంగా దిల్లీలోని ఆయన సమాధి రాజ్‌ఘాట్‌ వద్ద ప్రముఖులు మహాత్మునికి నివాళులు అర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ జాతిపితకు అంజలి ఘటించారు.

హైదరాబాద్ లోని బాపూఘాట్‌లోనూ గాంధీ విగ్రహాం వద్ద శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి మహమూద్ అలీ పుష్పంగుచ్ఛాలతో నివాళులర్పించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*