హరీశ్‌ రావు రాజీనామా

హైదరాబాద్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌ రావు ఆర్టీసీ టీఎంయు గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీఎంయు ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామరెడ్డికి పంపారు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా టీఎంయు నెలకొల్పారు.

తెలంగాణ ఉద్యమంలో కార్మికుల భాగస్వామ్యం పెంచాలనే లక్ష్యంతో హరీశ్ టీఎంయు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇతరత్రా అధికార కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉండటంతో ఆర్టీసీ కార్మిక యూనియన్ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలోనే టీఎంయూ బాధ్యతల నుంచి తప్పుకోవాలని హరీశ్ భావించారు.

కార్మికుల సంక్షేమానికి నిరంతరం తన సహకారం ఉంటుందని ఈ సందర్భంగా హరీశ్‌రావు స్పష్టం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*