ఎక్స్‌‌ప్రెస్ టీవీ ఛైర్మెన్ చిగురుపాటి జయరామ్ హత్య?

ఐతవరం: కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామ సమీపంలో ఎక్స్‌‌ప్రెస్ టీవీ ఛైర్మెన్, కోస్టల్ బ్యాంక్ చైర్మెన్ చిగురుపాటి జయరామ్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. జాతీయరహదారిపై రోడ్డు పక్కన పొల్లాల్లో ఆయన కారు పడి ఉంది.

ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా లేక హత్యనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిసిటివి ఫుటేజ్‌ పరిశీలిస్తున్నారు. టోల్‌గేట్‌ల వద్ద రికార్డయిన దృశ్యాలు పరిశీలిస్తున్నారు.

డ్రైవర్ పరారయ్యాడు. తెల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి కారు డ్రైవ్ చేసినట్లు గుర్తించారు. తలపై గాయాలుండటంతో దాడి చేసి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కారులో ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నట్లు గుర్తించారు. జయరాం చేతులు నలుపుగా మారాయి. దీంతో విష ప్రయోగం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కారులో బీర్ బాటిల్స్ లభించాయి.

జయరామ్ కారులో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఐతవరం వద్ద ఈ ఘటన జరిగింది. జయరామ్‌ భార్య పిల్లలు అమెరికాలో ఉంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*