మాల్యాకు బిగ్ షాక్.. ఎన్నికల వేళ మోదీకి మరో అడ్వాంటేజ్

షాక్‌లో మాల్యా.. ఎన్నికల వేళ మోదీకి మరో అడ్వాంటేజ్

లండన్: భారత బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి బ్రిటన్‌కు చెక్కేసిన కింగ్ ఫిషర్ అధినేత విజయ్‌మాల్యాకు షాకింగ్ న్యూస్. మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ అంగీకరించింది. దీంతో మాల్యాను భారత్‌కు తీసుకువచ్చేందుకు న్యాయపరమైన చిక్కులు తొలగినట్లైంది. గత ఏడాది డిసెంబర్‌లో మాల్యాను భారత్‌కు అప్పగించాలని బ్రిటన్ న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో బ్రిటన్ హోం మంత్రిత్వ శాఖ మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు తాము సుముఖమేనని తెలిపింది. భారత్‌కు వెళ్తే తనను ముంబై ఆర్థర్ జైలులో బంధిస్తారని, జైలులో వసతులు సరిగా ఉండవని మాల్యా లండన్ కోర్టులో వాదించాడు. దీంతో భారత్ ఆర్థర్ జైలు దృశ్యాలను రికార్డు చేసి పంపించింది. అయినా కూడా భారత్‌కు వెళ్లేందుకు మాల్యా నిరాకరిస్తూ వచ్చాడు. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా మోదీ సర్కారు తీవ్ర యత్నాలు చేసింది. స్వయంగా ప్రధాని భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా మాల్యాను భారత్‌కు అప్పగించే విషయంపై బ్రిటన్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఎట్టకేలకూ బ్రిటన్ అంగీకారం తెలపడంతో భారత్‌లో హర్షం వ్యక్తమౌతోంది.

రెండ్రోజుల క్రితం మాల్యా ట్విటర్ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఎగ్గొట్టిన దానికన్నా ఎక్కువ మొత్తంలో తన ఆస్తులను జప్తు చేశారని ట్వీట్ చేశాడు. ఇంతలోనే బ్రిటన్ మాల్యాను అప్పగించేందుకు అంగీకారం తెలపింది.

ఎన్నికల వేళ మాల్యాను భారత్‌కు రప్పించడం ద్వారా మోదీ సర్కారుకు లబ్ది చేకూరే అవకాశం ఉంది. మాల్యాను భారత్‌కు తీసుకురావాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. సామాన్యులు కూడా మాల్యాను భారత్‌కు తీసుకురావాలని కోరారు. ఎట్టకేలకూ మాల్యాను భారత్‌కు తీసుకువస్తుండటంతో మోదీ సర్కారుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*