పవిత్ర బంధం నటి ఝాన్సీ ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?

హైదరాబాద్: నటి ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మాటీవీలో ప్రసారం అయ్యే పవిత్రబంధంలో ఆమె నటిస్తున్నారు. శ్రీనగర్ కాలనీలోని సాయి అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాలు సేకరిస్తున్నారు. ఆమె భౌతికకాయాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్నారు.

ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడటాన్ని తోటి నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు.

 

ఝాన్సీ నిన్న కూడా పేరెంట్స్‌తో గొడవ పడినట్లు తెలిసింది. ఆత్మహత్యకు ముందు ఆమె సూర్య అనే వ్యక్తితో వాట్సాప్ చాట్ చేశారు. ఆరు నెలలుగా సూర్య, ఝాన్సీ ప్రేమించుకుంటున్నారని సమాచారం. సూర్య కృష్ణా జిల్లా ముద్దెనపల్లి మండలం వాడాలి గ్రామ వాసి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*