శిఖాపై జ‌య‌రాం భార్య ప‌ద్మ‌శ్రీ సంచ‌ల‌న నిర్ణ‌యం

కోస్టల్ బ్యాంక్ డైరక్టర్, ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మెన్ జయరాం హత్య కేసులో అనేక కీల‌క‌ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ హ‌త్య‌కేసులో సూత్ర‌ధారిగా భావిస్తున్న‌ శిఖా చౌదరిపై జ‌య‌రాం భార్య ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. శిఖా ప్రమేయం లేకుండా రాకేష్ ఈ నేరానికి పాల్పడే అవకాశం లేదని ఆమె పోలీసుల‌కు తెలిపారు. ఈ హ‌త్య‌కు ప్ర‌ధాన సూత్ర‌ధారి శిఖా యేన‌ని, ఆమె సూచ‌న‌ల మేర‌కే రాకేష్ ఈ హ‌త్య‌కు పాల్ప‌డ్డాడ‌ని ప‌ద్మ శ్రీ అన్నారు. ఎలాంటి ఒత్తిడులు లేకుండా కేసును లోతుగా విచారణ చేసి నిందితులని శిక్షించాలని ఆమె పోలీసుల‌ను కోరారు. కేసులో శిఖా చౌదరి పాత్ర లేదని పోలీసులు తేలిస్తే తాను న్యాయపోరాటం చేస్తాన‌న్నారు.

జ‌య‌రాం దశ దిన కర్మ తర్వాత అన్ని కంపెనీల డైరెక్టర్లతో బోర్డ్ మీటింగ్ జ‌రిపి శిఖా చౌదరిని సంస్థ‌ డైరెక్టర్ బాధ్య‌త‌ల‌నుంచి తప్పించనున్నట్టు తెలిపారు.

కాగా జయరాం అమెరికన్ సిటిజెన్ కావడంతో ఆయన పాస్ పోర్ట్ ని అమెరికన్ ఎంబసీలో ప‌ద్మ‌శ్రీ అంద‌జేయ‌నున్నారు. ఈ హత్య కేసుకు సంబంధించి FIR కాపీ తో పాటు డెత్ సర్టిఫికెట్ కావాలని ఆమె నందిగామ పోలీసులని కోరారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*