చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు హతం

చత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు చనిపోయినట్టు సమాచారం. బీజాపూర్‌‌లోని బైరామ్‌గఢ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడడంతో ఇరు వర్గాల మధ్య భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి.

ఎన్‌కౌంటర్‌లో కనీసం పదిమంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఘటన ప్రాంతం నుంచి పోలీసులు పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 11 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. చనిపోయిన మావోయిస్టుల వివరాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో ఎన్‌కౌంటర్ జరగడం ఇదే తొలిసారి. పదిహేనేళ్ల బీజేపీ పాలన తర్వాత చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. డిసెంబర్ 17న భూపేష్ భాగల్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*