చేవెళ్లలో కమల వికాసం

చేవెళ్ల)) తెలంగాణ లో పార్లమెంటు ఎన్నికల సందడి మొదలైంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తనదైన తడాఖా చూపించింది. రాష్ట్రమంతా క్లీన్ స్వీప్ చేసేసింది. దీంతో కాంగ్రెస్‌, టీడీపీ,బీజేపీ.. ఇలా అన్ని పార్టీలూ డీలా పడిపోయాయి.

ఈ పరిస్థితుల్లో కూడా బీజేపీ పార్టీకి కొన్ని చోట్ల నాయకులు పునరుత్తేజం కల్పిస్తున్నారు. అటువంటి నియోజక వర్గాల్లో చేవెళ్ల ని ప్రముఖంగా చెప్పుకోవాలి. ఈ పార్లమెంటు నియోజక వర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో మూడు అంటే లింగంపల్లి, రాజేంద్ర నగర్, మహేశరం నియోజక వర్గాలు పూర్తిగా సిటీ పరిధిలో ఉంటాయి. ఇక్కడే దాదాపు 13 లక్షల దాకా ఓటర్లు ఉన్నారు. అటు, రంగారెడ్డి రూరల్ ప్రాంతంలో చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి నియోజక వర్గాలు కనిపిస్తాయి. కానీ రూరల్ లో 7,8 లక్షలుమాత్రమే ఓటింగ్ ఉంటుంది.

సరిగ్గా ఈ పాయింట్ ను ఆధారంగా చేసుకొనే చేవెళ్ల నియోజక వర్గం పార్లమెంటు ఇన్‌ ఛార్జ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్సి బీ జనార్దన్ రెడ్డి పావులు కదుపుతున్నారు.
ఎందుచేతనంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ సెంటిమెంట్ బేస్ గా జరిగనవి. కానీ ఈ పార్ల మెంటు ఎన్నికలు జాతీయ సెంటెమెంట్ తో జరిగేవి. అందుచేత నరేంద్రమోదీ ను గెలిపించే రూట్ లో ప్రచారాన్ని ఖరారు చేస్తున్నారు. గచ్చిబౌలి, లింగంపల్లి, రాజేద్రనగర్ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల వారు ఉంటున్నారు. వీరందరినీ మోదీ వైపునకు తీసుకెళితే గెలుపు తేలిక అవుతుంది.

అటు, బీ జనార్దన్ రెడ్డి పూర్తి సమయం పార్టీకి, నియోజజక వర్గానికే కేటాయస్తున్నారు. పార్టీ పగ్గాలు చేత పుచ్చుకొని, క్యాడర్ ను ముందుకు పరిగెత్తిస్తున్నారు. వరుస పర్యటనలతో నియోజక వర్గం అంతటా చుట్టి వస్తున్నారు. అటు, కాంగ్రెస్, టీఆర్ఎస్ పరిస్థితి చూస్తే క్యాండెట్ ను ప్రకటించలేని పరిస్థితి. అందుచేత ఈ రెండు పార్టీల్లోన క్యాడర్ నిస్తేజంలోకి జారిపోతోంది. ఈ క్రమంలో బీజేపీ కి మాత్రక గా నిలిచే సంఘ్‌ పరి వార్, అనుబంధ సంస్థలు బీజేపీకి కలిసి వస్తున్నాయి.

అదే సమయంలో మరో అంశాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. 1991 నుంచి రాజకీయాల్లో ఉన్న బీ జనార్దన్ రెడ్డి ప్రధానంగా రాజేంద్ర నగర్, మహేశ్వరం ప్రాంతాల మీద పూర్తి పట్టు కలిగ ఉన్నారు. స్థానిక నాయకుల్న పేరుతో పలకరించే చనువు ఉంటోంది. దీంతో పాత మిత్రులంతా కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్, టీ ఆర్ ఎస్ క్యాండెట్ ల పేర్లు ప్రకటించే సమయానికి పాత మిత్రుల్ని తన వైపు మళ్లించుకొంటూ ముందుకు సాగిపోతున్నారు.
దీంతో చేవెళ్ల లో బీజేపీకి పూర్వ వైభవం తిరిగి వస్తుందన్న మాట బలంగా వినిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*