పారిశుధ్య కార్మికుల పాదాలు కడిగిన ప్రధాని మోదీ

ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న కుంభమేళాలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కుంభమేళాలో పారిశుధ్య పనులకు మెచ్చిన ప్రధాని మోదీ సఫాయీ కార్మికుల పాదాలను కడిగారు. మొత్తం ఐదుగురు కార్మికులకు పాదాలు కడిగి నమస్కారం చేశారు. కార్మికులకు శాలువాలు కప్పి గౌరవించారు.

అంతకు ముందు ప్రధాని గంగామాతకు పూజలు చేసి హారతి ఇచ్చారు. ఆ తర్వాత సంగం ఘాట్‌లో గంగలో మునకవేశారు.

అనంతరం జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ సఫాయి కార్మికుల పనితీరును మెచ్చుకున్నారు. ఈసారి జరిగిన కుంభమేళాకు దేశ విదేశాల నుంచి 15కోట్ల మందికి పైగా తరలివచ్చారు. ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా కోసం చేసిన ఏర్పాట్లను అంతా ప్రశంసించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*