మరో సంచలన వీడియో విడుదల చేసిన రాంగోపాల్ వర్మ

 

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో తీస్తున్న సినిమాకు సంబంధించి మరో వీడియో సాంగ్ విడుదల చేశారు.పి విజయ్ కుమార్ ఎన్టీఆర్ పాత్రధారిగా, యజ్ఞ శెట్టి లక్ష్మీ పార్వతి గా, శ్రీ తేజ్ చంద్రబాబు నాయుడు గా ఇందులో నటిస్తున్నారు.వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని రాకేష్ రెడ్డి నిర్మించారు. సంగీతం కళ్యాణి మాలిక్.

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన అనంతరం జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా తీస్తున్నట్లు రాంగోపాల్ వర్మ గతంలోనే ప్రకటించారు.దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోను ఇప్పటికే లక్షలాది మంది చూశారు.ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వర్మ తీస్తున్న ఈ సినిమా ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*