మిగ్ మిస్సయిన మాట నిజమే: భారత్

న్యూఢిల్లీ: ఒక మిగ్ 21 యుద్ధ విమానం, వాయసేనకు చెందిన ఓ పైలట్ కనిపించకుండా పోయిన మాట వాస్తవమేనని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ వైమానిక దాడి చేయబోయిందని, దానిని విజయవంతంగా తిప్పికొట్టినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

భారత వాయుసేన విమానాలు పాక్ విమానాలకు గట్టిగా బదులిచ్చాయనిరవీష్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో ఒక పాక్ విమానాన్ని కూల్చివేసినట్టు చెప్పారు. అలాగే, ఒక మిగ్ 21, ఐఏఎఫ్ పైలెట్ కనిపించకుండా పోయిన మాట నిజమేనన్నారు. తప్పిపోయిన పైలట్ తమ కస్టడీలో ఉన్నట్టు పాక్ చెబుతోందని, వాస్తవాలు నిర్ధారించే పనిలో ఉన్నట్టు చెప్పారు.

పాకిస్థాన్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర శిబిరాలపై కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ చేపడుతున్నట్టు దాడికి ముందే పాక్‌కు భారత్ తెలియజేసిందని రవీష్ కుమార్ వివరించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*