పాక్ అదుపులో మన పైలట్.. పేరు అభినందన్ వర్ధమాన్

న్యూఢిల్లీ: తమ భూభాగంలో కూల్చేసిన భారత్ విమానంలో ఉన్న పైలట్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పాక్‌ పేర్కొంది. అతడి పేరు అభినందన్ వర్థమాన్ అని తెలిపింది. అతడు ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అని పేర్కొంది. ఇందుకు సంబంధించినదిగా చెబుతున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి భారత వాయుసేన దుస్తులను ధరించి ఉన్నాడు. తన పేరు వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ అని పేర్కొన్నాడు. అతని చేతులు వెనక్కి కట్టేసి, కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి. పాక్‌ యుద్ధ విమానాలను వెంటాడుతూ నియంత్రణ రేఖను దాటిన రెండు భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలను పాక్ కూల్చివేసినట్లు పేర్కొన్నాడు. తమ అదుపులో ఐఏఎఫ్ కమాండర్ బందీగా ఉన్నాడన్న పాక్ ప్రకటనపై భారత్ ఇప్పటి వరకు స్పందించలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*