ప్రసంగం మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయిన మోదీ.. అత్యవసర సమావేశం

న్యూఢిల్లీ: పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన బాంబుల వర్షం కురిపించిన తర్వాత దాయాది దేశాల మధ్య ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు ఒకరి యుద్ధ విమానాన్ని మరొకరు కూల్చేశారు. ఓవైపు పరిస్థితి ఇలా ఉండగా, నేషనల్ యూత్ ఫెస్టివల్ 2019 కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ… విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతుండగా… పీఎంవోకు చెందిన ఓ అధికారి ఆయనకు ఒక చిన్న పేపర్ అందించారు.

దీంతో, ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసిన మోదీ వడివడిగా వేదిక దిగి వెళ్లిపోయారు.
భారత గగనతలంలోకి పాక్ యుద్ధ విమానాలు చొచ్చుకురావడంపై మోదీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*