భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత.. రూటుమార్చిన అంతర్జాతీయ విమానాలు

న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసి నేలమట్టం చేసిన తర్వాత భారత్‌-పాకిస్థాన్‌ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ప్రభావం అంతర్జాతీయ విమానాల సర్వీసులపై పడింది. భారత్‌, పాక్‌ గగనతలాల మీదుగా ప్రయాణించాల్సిన పలు విమానాలను దారి మళ్లించాల్సిందిగాసూచించినట్లు సమాచారం.

ఇప్పటికే గమ్యస్థానాలకు చేరుకున్న విమానాలు తిరుగు ప్రయాణంలో వేరే మార్గాలను ఎంచుకోవాల్సిందిగా ఆయా విమాన సంస్థలకు ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. మరోవైపు అమృత్‌సర్‌, జమ్ము, లేహ్‌తో పాటు పలు ప్రాంతాల్లో పౌర విమాన సేవలను రద్దు చేశారు.

విమానాల రాకపోకలను నిలిపివేయడంపై అమృత్‌సర్‌ విమానాశ్రయ డైరెక్టర్‌ ఏపీ ఆచార్య మాట్లాడుతూ.. అత్యవసర కారణాల వల్ల అమృత్‌సర్‌ గగనతలంలో విమానాల రాకపోకలను నిలిపివేసినట్టు చెప్పారు. వాణిజ్యపరమైన విమానాలు అమృత్‌సర్‌‌కు రావడం లేదని పేర్కొన్నారు. అలాగే విమానాశ్రయం నుంచి ఏ విమానాలు టేకాఫ్ కాలేదని స్పష్టంచేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*