వరంగల్ జిల్లాలో దారుణం.. విద్యార్ధినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఉన్మాది

హన్మకొండ: వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం జరిగింది. రవళి అనే డిగ్రీ విద్యార్ధినిపై అన్వేష్ అనే ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన రవళి ప్రస్తుతం వరంగల్ యంజియం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

హన్మకొండ వాగ్దేవీ కాలేజీ వద్ద రవళిని ఆపిన అన్వేష్ నడిరోడ్డుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. రెడ్డి గల్స్ హాస్టల్‌లో ఉన్న తన స్నేహితురాలు కావ్యను కలిసేందుకు రవళి వచ్చినప్పుడు అన్వేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థానికులు అన్వేష్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. స్వస్థలం సంగెం మండలం రామచంద్రాపురం. దాడికి పాల్పడ్డ అన్వేష్‌ కూడా వాగ్దేవి కాలేజీలోనే చదువుతున్నాడు. పెండ్యాల సాయి అన్వేష్ స్వస్థలం వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామము.

పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*