ఇమ్రాన్‌పై సిద్ధూ ప్రశంసల జల్లు

ఇస్లామాబాద్: భారత పైలట్ అభినందన్‌ను రేపు విడుదల చేస్తామన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ అభినందనలు కురిపించారు. ఇమ్రాన్ చర్యలన్నీ అద్భుతమని కితాబునిచ్చారు. ఇమ్రాన్ చర్యల ద్వారా కోట్లాది మంది భారతీయులు సంతోషంగా ఉన్నారని సిద్ధూ కీర్తించారు.

 

పాకిస్థాన్ విమానాన్ని కూల్చే క్రమంలో పీఓకేలో సేఫ్‌‌గా ల్యాండైన అభినందన్‌ను పాక్ బలగాలు చుట్టుముట్టాయి. అంతకుముందే పీఓకేలోని స్థానికులు, ఆ తర్వాత పాక్ సైనికులు అభినందన్‌ను తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత మీడియా ముందు ప్రవేశపెట్టారు.

గతంలో కార్గిల్ యుద్ధం సమయంలో పైలట్ నచికేతను అరెస్ట్ చేసిన పాక్ 8 రోజుల తర్వాత విడుదల చేసింది.

పుల్వామాలో జైష్ ఎ మహ్మద్ జరిపిన ఆత్మాహుతిదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు చనిపోవడంతో భారత్ ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. దీంతో పాక్ భారత భూభాగంలో వైమానిక దాడులకు తెగబడింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*