వర్థమాన్‌ను క్షేమంగా విడిచిపెట్టండి: పాక్‌ను కోరిన భారత్

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు బందీగా చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను క్షేమంగా విడిపించేందుకు భారత్ యత్నాలను ముమ్మరం చేసింది. అభినందన్‌కు హాని తలపెట్టకుండా క్షేమంగా విడిచిపెట్టాలంటూ పాకిస్థాన్‌లోని భారత్ హైకమిషన్.. పాక్ విదేశీ వ్యవహారాల శాఖను కోరింది.

పాక్ వద్ద బందీగా ఉన్నప్పటికీ అభినందన్ ఏమాత్రం గుండె నిబ్బరాన్ని కోల్పోలేదు. పాక్ సైనికులు చిత్రహింసలు పెడుతున్నప్పటికీ తన పేరు, హోదా తప్ప మరే వివరాలు వెల్లడించడం లేదు. అభినందన్ తిరిగి క్షేమంగా భారత్ చేరుకోవాలని దేశం మొత్తం ఆకాంక్షిస్తోంది. అతడి కోసం కోట్లాదిమంది కులమతాలకు అతీతంగా ప్రార్థనలు చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*