వైసీపీలో చేరిన జూనియర్ ఎన్టీఆర్ మామ

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ మామ నార్నె శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. ఈ రోజు ఉదయం లోటస్‌పాండ్‌కు వెళ్లిన ఆయన జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీ అధ్యక్షుడు జగన్ వైసీపీ కండువా కప్పి ఆహ్వానించారు.

ఎట్టి పరిస్థితుల్లోను జగన్‌మోహన్‌రెడ్డిని ఏపీ సీఎంగా గెలిపించుకోవడమే ధ్యేయంగా పార్టీలో చేరినట్లు నార్నె చెప్పారు. రాష్ట్రానికి మేలు చేసేది జగనేనని తాను భావిస్తున్నానని ఈ సందర్బంగా నార్నె తెలిపారు.

ఇదిలా ఉంటే.. నార్నె శ్రీనివాసరావు కేవలం పార్టీలో చేరడంతోనే సరిపెడతారా లేక ఎక్కడ నుంచైనా పోటీ చేస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. గుంటూరు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు గాను నార్నె ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*