ప్రీతిరెడ్డిని చంపింది మాజీ ప్రియుడే!.. చంపి సూట్‌కేసులో కుక్కిన వైనం..

సిడ్నీ: ఆస్ట్రేలియాలో భారతీయ డెంటిస్ట్ ప్రీతిరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. సిడ్నీ మార్కెట్ స్ట్రీట్‌లోని ఓ హోటల్‌లో తన కారులోనే సూట్‌కేసులో ఆమె మృతదేహం లభ్యమైంది. మాజీ ప్రియుడు డాక్టర్ హర్షవర్ధన్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రీతిరెడ్డి శరీరంలో అనేక కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ప్రీతిరెడ్డి మృతదేహం లభ్యమైన మరుసటి రోజే డాక్టర్ హర్షవర్ధన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ప్రీతిరెడ్డి హత్యకు సంబంధించి పోలీసులు ఫోన్ ద్వారా ప్రశ్నించిన తర్వాత తాను ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనంతో ఢీ కొట్టించడం ద్వారా డాక్టర్ హర్ష వర్ధన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సిడ్నీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్లెన్‌బ్రూక్ డెంటల్ హాస్పిటల్‌లో సర్జన్‌గా పనిచేస్తున్న ప్రీతిరెడ్డి ఓ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు ఈ నెల రెండున సెయింట్‌ లియోనార్డ్స్‌ వచ్చారు. చివరిసారిగా మెక్‌ డోనాల్డ్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఆదివారం బసచేసిన హోటల్‌ నుండి అదృశ్యమయ్యారు.

హర్ష వర్ధన్‌ను తన జోలికి రావద్దని ప్రీతి గతంలోనే హెచ్చరించారని తెలిసింది. అయినా కూడా వేధింపులు మానకపోవడంతో హర్షవర్ధన్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు ఆమె చివరిసారిగా రెస్టారెంట్‌కు వెళ్లారు. హర్ష వర్ధన్‌ను మరోసారి హెచ్చరించారు. అయితే హత్యకు పకడ్బందీ ప్రణాళిక వేసుకున్న హర్షవర్ధన్ ప్రీతిని కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసి ఆ తర్వాత సూట్‌కేసులో కుక్కి ఆమె కారులోనే పడేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కింగ్స్‌ఫోర్డ్ ప్రాంతంలో ఉన్న కారులో ప్రీతిరెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు ఫోన్ ద్వారా ప్రాథమిక విచారణ జరిపాక హర్షవర్ధన్ తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.

డెంటిస్ట్ ప్రీతిరెడ్డిది మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం గురుకుంట. ప్రీతి రెడ్డి తండ్రి నర్సింహారెడ్డి, తల్లి రేణుక. నర్సింహరెడ్డికి ఇద్దరు ఆడపిల్లలు. ప్రీతి రెడ్డి పెద్దకూతురు. చిన్న కుమార్తె కూడా డాక్టర్. తండ్రి నర్సింహారెడ్డి కూడా వైద్యుడే. 1996లో కుటుంబంతో సహా ఆస్ట్రేలియా వెళ్లి స్థిరపడ్డారు. నర్సింహారెడ్డి సోదరుల్లో ఒకరు అమెరికా, మరోకరు హైదరాబాద్, మరొకరు మహబూబ్ నగర్‌లో స్థిరబడ్డారు.

డిసెంబర్ 26 న నర్సింహారెడ్డి చివరగా హైదరాబాద్‌లో బంధువుల వివాహానికి వచ్చి వెళ్లారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*