జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిన జయసుధ

హైదరాబాద్‌: సినీ నటి జయసుధ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

టీడీపీలో చేరిన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా జయసుధ గతంలో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి తలసాని శ్రీనివాసయాదవ్‌పై విజయం సాధించారు. వైఎస్‌ చొరవతోనే రాజకీయాల్లోకి వచ్చానని జయసుధ వ్యాఖ్యానించారు. కొడుకును హీరోగా పరిచయం చేసినప్పటి నుంచి టీఆర్‌ఎస్‌తోనూ జయసుధకు సన్నిహిత సంబంధాలున్నాయి. టీఆర్‌ఎస్‌ ఒత్తిడితో వైసీపీలో చేరలేదని, తనపై ఎవరి ఒత్తిడి లేదని జయసుధ స్పష్టం చేశారు. తనకు సినిమా తప్ప ఎలాంటి వ్యాపారాలు లేవన్నారు.

వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని, ఓ రకంగా సొంత ఇంటికి చేరినట్లు అనిపిస్తోందని జయసుధ చెప్పారు. టీడీపీలో జాయిన్‌ అయినా తన విధులు ఏంటో ఎవరూ చెప్పలేదన్నారు. కాంగ్రెస్‌లో చేరినప్పుడు తాను ఎలా ఉండాలి, ఏం చేయాలన్నది వైఎస్‌ చెప్పేవారని జయసుధ గుర్తు చేశారు. సికింద్రాబాద్‌ సీటు ఇచ్చి వైఎస్‌ ప్రోత్సహించారని చెప్పారు. జగన్‌ ఆదేశిస్తే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని చెప్పారు. జగన్ ఆదేశాల ప్రకారం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని జయసుధ చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*