కేసీఆర్‌కు భలే షాకిచ్చిన రేవంత్ రెడ్డి.. సబిత యూటర్న్

హైదరాబాద్: తనను ఇబ్బందులకు గురిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి గట్టి షాకిచ్చారు. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే సబితను టీఆర్ఎస్‌లోకి లాక్కోవడం ద్వారా రంగారెడ్డి జిల్లాలో ఆ పార్టీని నామరూపాల్లేకుండా చేయాలన్న కేసీఆర్ ప్రయత్నానికి రేవంత్ బ్రేక్ వేశారు.

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చొరవతో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి యూటర్న్ తీసుకున్నారు. సోమవారం రాత్రి సబిత, ఆమె తనయుడు కార్తీక్‌తో రేవంత్ రెడ్డి భేటీ తర్వాత సబిత మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి కుటుంబానికి సబిత కుటుంబంతో చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. నిజానికి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం వెనక సబిత పాత్ర కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సబిత కాంగ్రెస్‌ను వీడుతున్నట్టు తెలియగానే రంగంలోకి దిగిన రేవంత్ ఆమెను బుజ్జగించారు. అదే సమయంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఫోన్ చేయడంతో సబిత మెత్తబడినట్టు సమాచారం.

రాహుల్ నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌తో రేవంత్‌రెడ్డితో కలిసి సబిత కుటుంబ సభ్యులు ఢిల్లీ వెళ్లి రాహుల్‌ను కలవబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, చేవళ్ల ఎంపీ సీటును తన కుమారుడు కార్తీక్ రెడ్డికి ఇవ్వకుండా విశ్వశ్వర్ రెడ్డికి ఇవ్వడంపై సబిత అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే సబిత అధిష్ఠానంపై అలకబూని టీఆర్ఎస్‌లోకి జంప్ కావాలని యోచించినట్టు సమాచారం. అయితే, రేవంత్ రెడ్డి రంగ ప్రవేశంతో ఆమె అలకవీడి కాంగ్రెస్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*