హైదరాబాద్‌లో మీ ఇంటి వద్దకే యోగా నిపుణులు

  • యోగాతో మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దండి

 

హైదరాబాద్: జూన్ 21వ తేదీని భారత దేశంలో యోగా డేగా జరుపుకుంటున్నారు. మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ యోగా డేను అందరూ జరుపుకుంటున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ యోగా డేను ప్రమోట్ చేశారు. ఆయన సూచన మేరకు ఐక్యరాజ్యసమతి జూన్ 21వ తేదీని ప్రపంచ యోగా డేగా జరుపుకునేందుకు నిర్ణయించింది.

యోగా పుట్టింది భారత దేశంలోనే. అమెరికా మొదలుకొని పలు దేశాల్లో యోగాను నిష్టగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇతర దేశాల్లో యోగాకు యూనివర్శిటీలు సైతం ఉన్నాయి. యోగాకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. పూర్వ కాలం నుంచి కూడా మునులు, యోగులు ఈ యోగ సాధన చేసి శక్తివంతులుగా ఉండేవారని చెబుతుంటారు. యోగ బలం తపో బలంతో సమానం. ఈ యోగ శక్తిని ప్రతి భారతీయుడు ఆకళింపు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మహాభారతంలో భీష్మాచార్చులకు తాను ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడు చనిపోయే విధంగా వరం ఉంది. నిజానికి ఆ వరాన్ని మనం యోగా ద్వారా కూడా సాధించుకోవచ్చని పలువురు చెబుతుంటారు. అంతటి మహత్తర శక్తి యోగాకు ఉంది.

యోగా ద్వారా మన శరీరంపై మనకు పూర్తి పట్టు వస్తుంది. ఏ రోగం కూడా దరి చేరదు. యోగాలో ఒక్కో వ్యాధికి ఒక్కో భంగిమ విధానాన్ని సాధన చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. భయంకరమైన వ్యాధులు సైతం యోగ సాధన ద్వారా నయం చేసుకోవచ్చు. మన వైద్య శాస్త్రంలో ఎక్కువగా చెప్పే “చికిత్స కంటే నివారణ ముఖ్యం” అనే నానుడి ఈ యోగాకు చక్కగా సరిపోతుంది. వ్యాధులు వచ్చిన తర్వాత ఆస్పత్రుల చుట్టూ తిరగేకన్నా ఈ యోగాతో ఆ అవసరం లేకుండా చేసుకోవచ్చు.

షుగర్, బీపీ వంటి వ్యాధుల నుంచి నొప్పులు, గ్యాస్ వంటి అన్ని అనారోగ్య సమస్యల వరకు యోగా సాధనతో తరిమేయవచ్చు. జీవన విధానంలో యోగాను భాగం చేసుకోవడం ప్రస్తుతం చాలా ముఖ్యం, అత్యవసరం కూడా. నిండు నూరేళ్లు సుఖంగా ఎలాంటి రోగాలు దరి చేరకుండా జీవించేందుకు యోగా చాలా ఉపయోగపడుతుంది.

అయితే ఈ యోగా సాధనను ఎవరంతట వారు చేసుకోవడం సరికాదు. ఒక గురువు తప్పనిసరిగా అవసరం. ఏ భంగిమ ఎప్పుడు చేయాలి, ఎంతవరకు ప్రాక్టీస్ చేయాలి, చేసే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి, శ్వాస నియంత్రణ ఎలా ఉండాలి అనేవి చెప్పే ఒక యోగా టీచర్ చాలా ముఖ్యం. మన ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్లి ఒక గురువు వద్ద ఈ యోగా ప్రాక్టీస్ చేసుకునేందుకు చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. కేవలం ఈ కారణంగానే యోగాను అశ్రద్ధ చేస్తున్నవారు ఎక్కువగా ఉంటున్నారు.

అందుకే ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా మీ వద్దకే నిష్ణాతులైన యోగా టీచర్లు వచ్చి మీకు యోగాను నేర్పిస్తారు. అన్ని మెళుకువలు తెలిసిన వారు దగ్గరుండి మీచేత ప్రాక్టీస్ చేయిస్తారు. అమూల్యమైన యోగ సాధనతో మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోనే ఉంచేందుకు నడుం కట్టిన యోగా మాస్టర్ లివాంకర్‌(9676094092, హైదరాబాద్)ను ఆసక్తి ఉన్నవారు సంప్రదించవచ్చు.

ఈయన గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠంలో యోగా టీచర్‌గా పని చేస్తున్నారు. అక్కడ ఎందరో యువతీ యువకులకు ఆయన యోగా నేర్పిస్తున్నారు. వేల సంఖ్యలో ఇక్కడకు వచ్చి ఆయన వద్ద యోగా నేర్చుకుంటున్నారు. అంతేకాదు ఎంతో మంది యోగా టీచర్లను ఈయన తయారు చేస్తున్నారు. ప్రస్తుత జీవన విధానాల కారణంగా ఎంతో విలువైన యోగాను పలువురు నేర్చుకోలేకపోతున్నారని గ్రహించిన ఆయన తనకు తెలిసిన యోగాను ఇంటింటికీ వెళ్లి అందరికీ నేర్పించాలని, ఆస్పత్రుల చుట్టు తిరిగే అవసరం లేకుండా, అనారోగ్యాన్ని దరిచేరనీయకుండా ఉండేలా ఎంతోమందిని తయారు చేయాలని లివాంకర్ సంకల్పించారు.

ఆసనాలు, క్రియలు, ప్రాణాయామ, మెడిటేషన్, సూర్యనమస్కారాలు, ఒత్తిడిని తగ్గించే యోగా థెరపీ, ఆస్తమా, షుగర్, వెన్ను నొప్పి, బరువు తగ్గేందుకు, హార్మోన్ లోపాలు, దీర్ఘకాలిక వ్యాధులు వంటి వాటికి వీరు యోగా ద్వారా చక్కని పరిష్కారం చూపుతారు. అంతేకాదు నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్ధులకు పాఠాలు కూడా నేర్పేందుకు కూడా వీరి టీం తయారైంది. జ్ఞాపక శక్తిని పెంచుకునే టెక్నిక్‌లు, వేద మంత్రాలు, కంప్యూటర్ బేసిక్స్‌ను బోధిస్తారు. సీబీఎస్‌సి, ఐసిఎస్ఈ, ఎస్ఎస్‌సి, ఒలిపియాడ్‌ ఇలా అన్ని రకాల విధ్యా విధానాలు, సిలబస్‌లను పిల్లలకు బోధిస్తారు.

( సంప్రదించండి

లివాంకర్ ఫోన్ నంబర్: 9676094092,

సురేంద్ర ఫోన్ నంబర్: 9618231824, 7989904074)

యోగా ట్రైనింగ్ ఇస్తున్న లివాంకర్

Image may contain: 3 people, wedding, tree, child, shoes and outdoor

యోగా మాస్టర్ లివాంకర్ యోగాసనాలు…

 

(విజయ్ కుమార్)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*