బిగ్‌బాస్ సీజన్ 3 విజేత ఎవరంటే?

హైదరాబాద్: స్టార్ మా లో జూలై 22 నుంచి తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బిగ్‌బాస్ సీజన్‌ 3 విన్నర్‌గా రాహుల్ సిప్లిగంజ్, రన్నరప్‌గా శ్రీముఖి నిలిచారరు. రాహుల్ రూ. 50 లక్షల ప్రైజ్‌ మనీ గెలుచుకున్నాడు. 17 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన ఈ రియాల్టీ షోలో వారం వారం జరిగే వడపోతల్లో అంతా ఎలిమినేట్‌ కాగా చివరికి రాహుల్, శ్రీముఖి మిగిలారు. ఈ ఇద్దరిలో రాహుల్ విజేతగా నిలిచి రూ. 50 లక్షలు గెలుకున్నాడని హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించారు. ప్రైజ్‌ మనీ గెలిచాక ఆ డబ్బుతో బార్బర్‌ షాప్’ పెడతానని రాహుల్ చెప్పడంతో అతడి సింప్లిసిటీ, కులవృత్తిపై అతడికున్న గౌరవాన్ని అంతా మెచ్చుకుంటున్నారు.

సీజన్ 3 ఫైనల్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన డ్యాన్సులు ఆకట్టుకున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*