కన్నుల పండువగా ఏఎన్నార్ అవార్డుల కార్యక్రమం

హైదరాబాద్: సినీ నటి రేఖ, దివంగత నటి శ్రీదేవికి అక్కినేని నాగేశ్వరావు జాతీయ పురస్కారం అవార్డులు అందించారు  హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ అవార్డు కార్యక్రమంలో అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు మెగాస్టార్ చిరంజీవి, బోనీకపూర్ కుటుంబ సభ్యులు, సుబ్బరామిరెడ్డి,  పలువురు పాల్గొన్నారు.

2006 నుండి ఏఎన్ఆర్ కుటుంబ సభ్యులు సినీ ప్రముఖులకు ఈ అవార్డులు అందజేస్తున్నారు.  సినీ రంగానికి ఆయా ప్రముఖులు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులు బహుకరిస్తున్నారు. ఏఎన్ఆర్ అవార్డును శ్రీ దేవి భర్త బోనీ కపూర్ కు చిరంజీవి అందజేశారు.

ఈ కార్యక్రమంలో నటి రేఖ అచ్చ తెలుగులో మాట్లాడి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. రేఖ తమిళనటుడు జెమినీ గణేశన్ కుమార్తె. రేఖ నటించిన తొలి తెలుగు చిత్రం రంగుల రాట్నం అని నాగ్ చెప్పగా కాదు ఇంటి గుట్టు అని ఆమె సవరించారు. ఈ సందర్భంగా శ్రీదేవి, రేఖలపై నాగ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇద్దరూ అందగత్తెలని చెప్పారు. నాగ్ ప్రశంసలకు రేఖ మురిసిపోయారు.

Upender, Rachana Journalism College, Hyderabad.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*