అంగరంగ వైభవంగా శ్రీ కురుమూర్తి స్వామి ఉత్సవాలు

* అంగరంగ వైభవంగా శ్రీ కురుమూర్తి స్వామి జాతర
ఉత్సవాలు

* వివిధ ప్రాంతాల నుండి తరలివస్తున్న భక్తులు

* కురుమూర్తి గట్టు ని మరో తిరుమల అలాగే చిన్న తిరుపతి అని కూడా అంటారు

చింతకుంట: మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం కురుమూర్తి గ్రామంలోని దేవస్థానం శ్రీ కురుమూర్తి స్వామి దేవాలయం జనాలతో కళకళలాడుతుంది.ఇక్కడ జాతర ప్రతిఏటా నెల రోజులు జరుపుకుంటారు,అమావాస్య నుంచి మళ్ళీ వచ్చే అమావాస్య వరకు జనాలతో దేవాలయం కిక్కిరిసి పోతుంది కురుమూర్తి మొదటిరోజు స్వామి కి వస్త్రాలు పక్కన అమరచింత గ్రామం లోని భక్తులు స్వయానా నేసి కాలినడకన స్వామి నీ అలంకరించడానికి తీసుకువస్తారు.స్వామిని దర్శించడానికి పలు ప్రాంతాలనుంచి భక్తులు వస్తారు.

కురుమూర్తి గట్టు విశిష్టత ఏంటి అంటే *పురాణాల ప్రకారం కురుమూర్తిస్వామి కుబేరునికి అప్పు తీర్చలేక ఇక్కడ ఉన్న కురుమూర్తి గుట్ట పైకి వచ్చి తల దాచుకున్నారు అని అంటారు.

స్వామిని కోరిన కోరికలకు ఫలిస్తాయని అక్కడి భక్తుల నమ్మకం. ఇక్కడికి వచ్చే భక్తులు లక్షల్లో ఉంటారు దానికి తగిన వసతులు బందోబస్తుతో సహాయ సిబ్బంది తో ఏర్పాటు చే కూర్చారు. పిల్లలను అలరించేలా పెద్దలను ఆకట్టుకునేలా ఆట సౌకర్యం గల వస్తువులు బొమ్మలు రంగుల రత్నాలతో ఈ మహోత్సవం కొనసాగుతోంది.

-Varshini Goud, Rachana Journalism College, Hyderabad.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*