రాజస్థాన్‌లో దుమ్మురేపుతున్న తెలంగాణ కళాకారులు

జైపూర్: రాజస్థాన్‌లో తెలంగాణ కళాకారులు దుమ్మురేపుతున్నారు. జానపద నృత్యాలతో హోరెత్తిస్తున్నారు. రాజస్థాన్ బూందిలో నార్త్ జోన్ కల్చరల్ సెంటర్ పటియాల డైరెక్టరేట్ ఆధ్వర్యంలో జరుగుతున్న సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో సత్తా చాటుతున్నారు.

మొత్తం 15 రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు ఇస్తున్నారు. తెలంగాణ హైదరాబాద్ నుంచి ఉపేందర్ అనే జర్నలిజం విద్యార్థి నృత్య ప్రదర్శన ఇస్తున్నాడు. ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం నారాయణ పురం గ్రామానికి చెందిన సత్తయ్య సావిత్రమ్మ కుమారుడు ఉపేందర్‌కు చిన్నప్పటినుంచే డ్యాన్స్ అంటే ఆసక్తి. ఓపక్క చదువులు కొనసాగిస్తూనే జానపద నృత్యం మాతురిపై పట్టు సాధించాడు. డాన్స్ మాస్టర్ జంపయ్య ప్రోత్సాహంతో అనేక చోట్ల ప్రదర్శనలు ఇస్తున్నాడు. ఇప్పటికే అనేకచోట్ల ప్రదర్శనలిచ్చి ప్రశంసలు పొందిన ఉపేందర్ తన మిత్ర బృందంతో కలసి తాజాగా బూందీ ఉత్సవాల్లోనూ తడాఖా చూపిస్తున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హర్యానా, గుజరాత్, అస్సాం, మహారాష్ట్ర, జమ్ము,కాశ్మీర్, మధ్యప్రదేశ్ , తమిళనాడు ,కర్ణాటక నుండి వచ్చిన కళాకారులు ఆటపాటలతో, విభిన్న వేషధారణలతో ఆకట్టుకుంటున్నారు. ఈ నెల 26తో రిహార్సల్స్ ముగిశాయి. అంతర్జాతీయ కొరియోగ్రాఫర్లు రిహార్సల్స్ చూసి అనుమతిచ్చాక వేదికపై ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఈ నెల 30 వరకూ ప్రదర్శనలు కొనసాగుతాయి.

-ప్రవళిక, రచన జర్నలిజం కళాశాల, హైదరాబ

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*