ప్రారంభమైన ఆర్టీసీ బస్సులు.. డిపోల్లో కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం

హైదరాబాద్: తిరిగి విధుల్లోకి చేరాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇచ్చిన పిలుపుమేరకు ఆర్టీసీ ఉద్యోగులు ఉత్సాహంగా డ్యూటీలకు హాజరౌతున్నారు. బస్సులు రోడ్లపైకి వచ్చేశాయి. 52 రోజుల పాటు సాగిన సమ్మె ఎట్టకేలకూ ముగియడంతో జనం కూడా రిలీఫ్‌గా ఫీల్ అవుతున్నారు. నిన్న క్యాబినెట్ సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్ కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున టికెట్ ఛార్జీలు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఛార్జీలు పెంచడం ద్వారా 750 కోట్ల రూపాయల మేర నష్టం తగ్గించుకోవచ్చని చెప్పారు. అంతేకాదు వంద కోట్ల రూపాయలను తక్షణ సాయంగా ప్రకటించారు. సమ్మెకాలంలో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. యూనియన్లతో, ప్రతిపక్షాలతో జాగ్రత్తగా ఉండాలని కూడా సీఎం సూచించారు.

విధుల్లో చేరాలన్న కేసీఆర్ ప్రకటనతో ఆర్టీసీ డిపోల వద్ద కార్మికులు క్షీరాభిషేకం నిర్వహించారు.

 

నిన్న కేసీఆర్ విలేకరుల సమావేశంలో చెప్పిన ముఖ్యాంశాలు

…………………….

ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాటలు నమ్మి పెడదారి పడుతున్నారు
జీవితాలను పాడు చేసుకుంటున్నారు: కేసీఆర్‌
కార్మికులది అసంబద్ధమైన డిమాండ్లతో కూడిన అనాలోచిత సమ్మె

రాజకీయ నిరుద్యోగులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు: కేసీఆర్‌
వాళ్లు పాలించే రాష్ట్రాల్లో ఎక్కడా ఆర్టీసీని విలీనం చేయలేదు
ఇక్కడ మాత్రం విలీనం చేయాలని మాట్లాడుతారా?: కేసీఆర్‌
ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని కార్మికులకు ఎన్నోసార్లు చెప్పా
ప్రతిపక్షాలు కలిసి కార్మికులను బజారున పడేశాయి
కార్మికుల మేలు కోసం హైకోర్టు సీజే సీరియస్‌గా ఆలోచించారు
రాజ్‌భవన్‌లో కలిసినప్పుడు కూడా కార్మికులను ఆదుకోవాలని కోరారు
లేబర్‌ కోర్టులో ఈ సమ్మె వ్యవహారం ఉంది..
లేబర్‌ యాక్ట్‌ ప్రకారం ఇది చట్టవిరుద్ధమైన సమ్మె: కేసీఆర్‌
రవాణాను ప్రైవేటీకరణ చేసే చట్టానికి బీజేపీ ఎంపీలు మద్దతిచ్చారు
పార్లమెంట్‌లో ఓటు వేసి, ఇక్కడ ధమ్కీలు ఇస్తారా?: కేసీఆర్‌
ఆర్టీసీలో కేంద్రం వాటా ఉందంటున్నారు..
ఆ లెక్కలన్నీ బయటికి తీస్తున్నాం: కేసీఆర్‌
31శాతం వాటా కేంద్రానికి ఉంటే నిధులు ఇస్తుందా?: కేసీఆర్‌
కార్మికుల బతుకులతో బీజేపీ నేతలు ఆడుకుంటున్నారు: కేసీఆర్‌

ఆర్టీసీ కార్మికులంతా రేపు విధుల్లో చేరండి: కేసీఆర్‌
విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీకి ఆదేశాలిస్తాం: కేసీఆర్‌
తక్షణ సాయం కింద ఆర్టీసీకి రూ.100 కోట్లు ఇస్తాం: కేసీఆర్‌
ప్రతి కిలోమీటర్‌కు 20 పైసలు ఛార్జీ పెంచుతాం: సీఎం కేసీఆర్‌
విధుల్లో చేరితే ఎలాంటి షరతులు విధించం: కేసీఆర్‌

ప్రైవేట్‌ పర్మిట్లు కూడా ఆర్టీసీ వాళ్లకే ఇద్దామనుకున్నాం: కేసీఆర్‌
ప్రగతిభవన్‌కు త్వరలో కార్మికులను పిలుస్తా..
మంచిచెడ్డలు నేనే అడిగి తెలుసుకుంటా: కేసీఆర్‌

యూనియన్ల విషయంలో కఠినంగా ఉంటాం..
చనిపోయిన కార్మికుల కుటుంబాలకు తక్షణసాయం చేస్తాం..
వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తాం: కేసీఆర్‌
యూనియన్లను దగ్గరికి రానివ్వను..
వర్కర్స్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేస్తాం: కేసీఆర్‌

నేను రవాణాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ రూ.13 కోట్ల 80 లక్షల నష్టాల్లో ఉంది
నష్టాన్ని పూడ్చి మరో రూ.1450 కోట్ల లాభం తీసుకొచ్చా
యూనియన్‌ నేతల ఉన్మాదంలో పడి బతుకులు నాశనం చేసుకోవద్దు.

– మోతె మల్లేశ్, నెల్లకొండి శ్రీకాంత్..  రచన జర్నలిజం కళాశాల, నారాయణగూడ, హైదరాబాద్.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*