దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌పై సినీ పరిశ్రమ హర్షం

హైదరాబాద్: దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌పై తెలుగు సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా హీరోలు, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు స్పందిస్తున్నారు.

 

జూనియర్ ఎన్టీఆర్ దిశకు న్యాయం జరిగిందంటూ ట్వీట్ చేశారు.

దిశకు న్యాయం జరిగిందంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.

హీరో మంచు మనోజ్ తన ట్వీట్‌లో ఎన్‌కౌంటర్‌ను సమర్థించాడు.

 

హీరో నాని తన ట్వీట్‌లో ఊరికి ఒకరే రౌడీ ఉండాలని అది కూడా పోలీస్ అయ్యుండాలన్నారు.

దర్శకుడు హరీశ్ శంకర్ అయితే పోలీసులను ఆకాశానికెత్తేశారు. సినిమా ట్రైలర్ల కన్నా తెలంగాణ పోలీస్‌ను ట్రెండింగ్ చేయాలని సూచించారు.

సజ్జనార్ గతంలో వరంగల్ యాసిడ్ దాడికి పాల్పడిన వారిని కూడా ఎన్‌కౌంటర్ చేశారని ఇప్పుడు అందరూ గుర్తు చేస్తున్నారు. మిగతా సెలబ్రిటీస్ కూడా దిశ హంతకులను హతమార్చడాన్ని స్వాగతిస్తున్నారు.  సూర్యాపేటలో సజ్జనార్‌ చిత్ర పటానికి క్లీరాభిషేకం చేశారు. సామాన్యులు కూడా ఎన్‌కౌంటర్‌ను స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా ఎన్‌కౌంటర్ జరిగిన చోట జనం పెద్దఎత్తున పోలీసులకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. పోలీసులపై పూల వర్షం కురిపిస్తున్నారు.

-శైలజ పాలకూర్ల, రచన జర్నలిజం కళాశాల, హైదరాబాద్.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*