ఆటల్లో రాణిస్తే గుర్తింపు – దానికి నేనే నిదర్శనం

రెయిన్బో స్పోర్ట్స్ మీట్ లో పివి సింధు

హైదరాబాద్ : విద్యార్థులు చదువులో రాణిస్తూనే ఆట పాటల్లోనూ ఉన్నత స్థానాలు అధిగమించాలని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు సూచించారు. బీరంగూడ లోని రెయిన్ బో ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగిన వార్షిక స్పోర్ట్స్ మీట్ కి పీవీ సింధు ముఖ్య అతిథిగా హాజరై పలు పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడంతోపాటు తన సందేశాన్ని అందించారు. విద్యార్థులు శారీరకంగా మానసికంగా గా ఎదిగేందుకు ఆరోగ్యవంతులుగా తయారయ్యేందుకు ఆటలు ఎంతగానో దోహదం చేస్తాయని పీవీ సింధు అన్నారు. ఆటల్లో ప్రతిభ చాటిన వాళ్లకు ఎంతో ఆదరణ ఉంటుందనడానికి నేనే నిదర్శనమని విద్యార్థులలో ఆలోచన కల్పించారు. పాఠశాలలో ఉపాధ్యాయు లతో పాటు తల్లిదండ్రులు కూడా పిల్లలు ఆటలు రాణించేలా శ్రద్ధ చూపించాలని కోరారు.

రెయి న్ బో ఇంటర్నేషనల్ స్కూల్ లో వారం రోజులు గా స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు వాలీబాల్, హ్యాండ్ బాల్, లాంగ్ జంప్, బాస్కెట్ బాల్, రిలే రేస్, రన్నింగ్ రేస్, కబడ్డీ, కోకో, చెస్, క్యారమ్స్ వంటి ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు పి.వి.సింధు బహుమతులు అందజేశారు. పాఠశాల చైర్మన్ తోటకూర రాంబాబు మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులు గత కొన్నేళ్లుగా సాధిస్తున్న విజయాలను తెలియజేశారు. రెయిన్ బో స్కూల్ సీఈఓ గౌతమ్ వార్షిక స్పోర్ట్స్ రిపోర్ట్ ను వివరించారు. ఈ కార్యక్రమంలో చాముండేశ్వరి నాథ్, రెయిన్ బో ఇంటర్నేషనల్ స్కూల్ కరస్పాండెంట్ గాయత్రి, ప్రిన్సిపల్ మంజుల తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన నృత్యాలు, పరేడ్ అందరినీ అలరించాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*