కన్నుల పండువగా తిరుప్పావై- ‘సిరినోము పాటల పండుగ’

హైదరాబాద్: భాగ్యనగరంలోని తెలుగు విశ్వవిద్యాలయం ధనుర్మాస కళను సంతరించుకుంది. బాపూ రమణ యూ ట్యూబ్ ఛానెల్, శాంతా వసంత ట్రస్ట్‌… తిరుప్పావై- ‘సిరినోము పాటల పండుగ’ను నిర్వహించాయి. ముళ్లపూడి వెంకటరమణ దశాబ్దం క్రితం తెనుగీకరించిన 30 తమిళ పాశురాలకు, 13 మంది ప్రఖ్యాత సంగీత దర్శకులు బాణీలు కూర్చి, 18 మంది గాయనీమణులతో స్వరావిష్కరణ జరిపారు. కార్యక్రమంలో ఆయా సంగీతదర్శకులను, గాయకులను నిర్వాహకులు సత్కరించారు. ఈ సందర్భంగా అనంతలక్ష్మి రచించిన ‘మధురవీచి’ పుస్తకాన్ని ముళ్ళపూడి శ్రీదేవి ఆవిష్కరించారు.

కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ కే.వీ.రమణాచారి, గాన గంధర్వుడు ఎస్. పీ. బాలసుబ్రహ్మణ్యం, ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం కీరవాణి సాలూరు వాసూ రావు, మాధవపెద్ది సురేష్, ఎం.ఎం.శ్రీలేఖ, ప్రముఖ పారిశ్రామికవేత్త వరప్రసాద్ రెడ్డి, విశ్రాంత ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ, నేపథ్య గాయని సునీత, నిత్యసంతోషిణి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి గాయత్రి భార్గవి, జ్యోత్న వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ముళ్ళపూడి వర వందన సమర్పణ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*