విండీస్‌పై 2-1తో వన్డే సిరీస్ నెగ్గిన భారత్

కటక్: వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తో భారత్ గెలుచుకుంది. కటక్‌లో జరిగిన చివరి వన్డేలో విండీస్ నిర్దేశించిన 316 పరుగుల విజయలక్ష్యాన్ని 48.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి భారత్ ఛేదించింది. భారత బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లీ 85, రోహిత్ శర్మ 63, కేఎల్ రాహుల్ 77 పరుగులు చేశారు. శ్రేయాస్ అయ్యర్ 7, రిషభ్ పంత్ 7, కేదార్ జాదవ్ 9 పరుగులు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. పొలార్డ్ 74, పూరన్ 89 పరుగులు చేశారు.

విండీస్‌పై భారత్ వరుసగా పదో సిరీస్‌ గెలుకోవడం విశేషం.

– మారుతి ఆజాది, హైదరాబాద్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*