విండీస్ విధించిన భారీ లక్ష్యాన్ని భారత్ చేదిస్తుందా?

కటక్: నిర్ణయాత్మక మూడో వన్డేలో విండీస్ విజృంభించింది భారత్ ముందు 316 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు కు దిగిన విండీస్ మొదట ఆచితూచి ఆడుతూ పవర్ ప్లే ముగిసేసరికి 44 పరుగులు చేసింది. 14వ ఓవర్లో జడేజా లూయిస్ ని వెనక్కి పంపడంతో ఈ భాగస్వామ్యం విడిపోయింది ఈ క్రమంలో shai hope 42 (50 బంతుల్లో 5/4) విండీస్ తరఫున అతి తక్కువ మ్యాచ్లలో 3000 పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. చేజ్ 38 (48 బంతులలో 3/4), హిట్ మేయర్ 37 (33 బంతులలో 2/4,2/6) లను అను వరుస ఓవర్లలో అరంగేట్రం బౌలర్ నవదీప్ షైనీ వెనక్కి పంపి భారత శిబిరంలో ఆనందాన్ని నింపాడు. వారి స్థానంలో వచ్చిన పూరన్ 89 (64 బంతులలో 10/4,3/6) పోలార్డ్ 74(51 బంతులలో 3/4,7/6) ద్వయం ఆకాశమే హద్దుగా చెలరేగి చివరి 5 ఓవర్లలో 77 పరుగులతో విండీస్ కు ఊహించని స్కోర్ ని అందించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*